అసెంబ్లీ సమావేశాలు.. పది రోజులు వాయిదా

by  |
అసెంబ్లీ సమావేశాలు.. పది రోజులు వాయిదా
X

భోపాల్: మధ్యప్రదేశ్ ప్రభుత్వ విశ్వాస పరీక్ష నేపథ్యంలో సోమవారం ఉదయం తీవ్ర ఉత్కంఠ నడుమ అసెంబ్లీ సమావేశాలు మొదలయ్యాయి. గవర్నర్ ప్రసంగాన్ని క్లుప్తంగా ముగించారు. ఫ్లోర్ టెస్ట్ నేపథ్యంలో అసెంబ్లీలో ఇరుపార్టీల ఎమ్మెల్యేలు ఆందోళనలకు దిగారు. ఈ రభస జరుగుతుండగానే.. కరోనావైరస్‌ను దృష్టిలో పెట్టుకుని సమావేశాలను పదిరోజులు అంటే 26వ తేదీవరకు వాయిదా వేస్తున్నట్టు స్పీకర్ ఎన్‌పీ ప్రజాపతి ప్రకటించారు. అంటే ఫ్లోర్ టెస్ట్ కూడా అప్పటి వరకు వాయిదా పడినట్టే అయింది.

ఫ్లోర్ టెస్ట్ నిర్వహించాలని స్పీకర్ ఎన్‌పీ ప్రజాపతిని ఆదేశించే అధికారం గవర్నర్ లాల్‌‌జీ టాండన్‌కు లేదని కాంగ్రెస్ నేతలు చేసిన వ్యాఖ్యలతో విశ్వాస పరీక్ష జరుగుతుందా? లేదా? అనే అనుమానాలు మొదలయ్యాయి. అలాగే, తమ ఎమ్మెల్యేలను బెంగళూరులో నిర్బంధించి ఇక్కడ బలపరీక్ష నిర్వహిస్తామనడం రాజ్యాంగ విరుద్ధమని సీఎం కమల్‌నాథ్… గవర్నర్‌కు లేఖ రాశారు. అయితే, స్పీకర్ నిర్ణయానికి తాము కట్టుబడతామని మంత్రి పీసీ శర్మ తెలిపారు. విశ్వాసపరీక్షకు కాంగ్రెస్‌కు ఎటువంటి భయాందోళనలు లేవని, తాము ఫ్లోర్ టెస్ట్‌కు సిద్ధమేనని అన్నారు.

Next Story

Most Viewed