దేశ రాజధాని ఢిల్లీలో ఆప్ vs బీజేపీ

by Mahesh |
దేశ రాజధాని ఢిల్లీలో ఆప్ vs బీజేపీ
X

దిశ, వెబ్‌డెస్క్: భారత రాజధాని అయిన ఢిల్లీలో రోజు రోజుకు రాజకీయ దుమారం పెరిగిపోతుంది. ఇక్కడ ఆమ్ ఆద్మీ పార్టీ, బీజేపీల మధ్య పచ్చగడ్డి వేస్తే మండిపోతుంది. ఆప్ ఎంపీ స్వాతి మలివాల్ పై కేజ్రీవాల్ పీఎ బి భవ్ కుమార్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. కాగా ఈ ఇష్యూ పై స్పందించిన సీఎం కేజ్రీవాల్ దమ్ముంటే తమను అరెస్ట్ చేయాలని సవాల్ విసిరారు. అలాగే ఈ రోజు ఢిల్లీలోని బీజేపీ పార్టీ ప్రధాన కార్యాలయాన్ని తమ ఎమ్మెల్యేలు, ఎంపీలతో ముట్టడిస్తామని పిలుపునిచ్చారు. ఢిల్లీ లిక్కర్ స్కాం కి సంబంధించిన మనీ లాండరింగ్ కేసులో కేజ్రీవాల్ జైల్లో ఉండి ఇటీవల ఎన్నికల ప్రచారం కోసం బెయిల్ బయటకొచ్చారు. నాటి నుంచి బీజేపీని టార్గెట్ గా చేసుకున్న ఆయన విమర్శల వర్షం గుప్పిస్తున్నారు. తనని, తన నేతలను జైల్లో పెట్టి లొంగదీసుకోవాలని చూస్తున్నారని.. బీజేపీకి ఓటు వేసి గెలిపిస్తే ఆప్ మంత్రులతో పాటు తనను కూడా మరోసారి జైలుకు పంపుతారని ఎన్నికల ప్రచారంలో చెప్పుకొస్తున్నారు. కాగా దీనిపై స్పందించిన బీజేపీ.. తప్పు చేసిన వారు ఎవరైన జైలుకు వెళ్లడం ఖాయమని.. అప్ మంత్రులు పలువురు త్వరలోనే జైలుకు పోవడానికి సిద్దమయ్యారని బీజేపీ విమర్శలు కురిపిస్తుంది. దీంతో ప్రస్తుతం ఢిల్లీలో బీజేపీ vs ఢిల్లీగా వాతావరణం మారిపోయింది. తాజాగా ఆప్ పిలుపుతో బీజేపీ కార్యాలయం వద్ద భారీ ఎత్తున పోలీసులు, కేంద్ర బలగాలు మోహరించారు. దీంతో అక్కడి వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది.

Next Story

Most Viewed