581 ఏళ్ళ తర్వాత అరుదైన చంద్రగ్రహణం… విశేషాలివే!

by  |
581 ఏళ్ళ తర్వాత అరుదైన చంద్రగ్రహణం… విశేషాలివే!
X

దిశ, వెబ్ డెస్క్ :హిందువులు పవిత్రంగా జరుపుకునే కార్తీక పౌర్ణమి ఈ నెల 19న రాబోతుంది. అయితే అదే రోజున ఈ ఏడాది చివరి చంద్రగ్రహణం దర్శనమివ్వడం విశేషం. సంవత్సరంలో ఏర్పడే చివరి చంద్రగ్రహణం ఇది. మొదటి చంద్రగ్రహణం మే నెలలో వచ్చిన సంగతి తెలిసిందే. రెండవ చంద్రగ్రహణం ప్రపంచ వ్యాప్తంగా నవంబర్ 18, 19 తేదీల్లో కనపించనుండగా, భారతదేశంలో నవంబర్ 19న ఈశాన్య భారతదేశంలో కొంత సమయం పాటు కనపించనుందని నాసా ప్రకటించింది. కాగా ఈ గ్రహణం 581 ఏళ్ళ తర్వాత కనిపించనున్నట్టు శాస్త్రజ్ఞులు చెబుతున్నారు.

దేశంలో చాలా ప్రదేశాల్లో ఈ చంద్రగ్రహణం కనిపించదు. ఈశాన్య భారత్ లోని అస్సాం, అరుణాచల్ ప్రదేశ్ లాంటి కొన్ని రాష్ట్రాల్లో మాత్రమే ఈ గ్రహణం కనిపిస్తుంది. ఇది భారత్ కాలమాన ప్రకారం మధ్యాహ్నం 1.30 గంటలకు ఏర్పడనుంది. సూర్యుడు, చంద్రుడుకి మధ్య భూమి ఒకే వరసులో వచ్చి, భూమి నీడ చంద్రుడి పైన పడితే దాన్ని చంద్రగ్రహణం అంటారు. అయితే కార్తీక పౌర్ణమి రోజున ఏర్పడనున్న చంద్రగ్రహణాన్ని ‘ఫ్రాస్ట్ మూన్’గా పిలుస్తారు. ఈ చంద్రగ్రహణం ఉత్తరమెరికాలో 50 దేశాల్లో కనిపించనుంది. ఉత్తర, దక్షిణ అమెరికా, తూర్పు ఆసియా, ఆస్ట్రేలియా.. పసిఫిక్ ప్రాంతాల్లో కూడా చంద్రగ్రహణం దర్వనమివ్వబోతుంది. కార్తీక పౌర్ణమి రోజున హిందువులు ప్రవిత్ర గంగా నదిలో స్నానమాచరించి, దీపారాధన, అన్నదానం వంటి కార్యక్రమాల్లో పాల్గొంటారు. విష్ణువును పూజిస్తారు.

Next Story

Most Viewed