నేటితో ముగియనున్న ఎల్ఆర్ఎస్ గడువు

by  |
నేటితో ముగియనున్న ఎల్ఆర్ఎస్ గడువు
X

దిశ, వెబ్‎డెస్క్: తెలంగాణలో ప్లాట్లు, అక్రమ లే అవుట్ల క్రమబద్దీకరణకు ప్రభుత్వం చేప‌ట్టిన ఎల్ఆర్ఎస్‌ ద‌ర‌ఖాస్తు గ‌డువు నేటితో ముగియ‌నుంది. శుక్రవారం వరకు 24,14,337 ల‌క్ష‌ల ద‌ర‌ఖాస్తులు వ‌చ్చాయి. నిన్న ఒక్క‌రోజే 70 వేల‌కుపైగా మంది ఎల్ఆర్ఎస్‌ కోసం దరఖాస్తు చేసుకున్నారు. నేడు లక్ష వరకు దరఖాస్తులు వచ్చే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. కాగా, ఈ నెల 15న ద‌ర‌ఖాస్తుల గ‌డువు ముగిసింది. అయితే రాష్ట్రంలో వ‌ర్షాలు, ప‌లు కార‌ణాల దృష్ట్యా మ‌రో 15 రోజుల‌పాటు ద‌ర‌ఖాస్తు గ‌డువు పొండిగించింది.

Next Story