- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
సీక్రెట్ లవ్.. భయంతో ప్రేమికులు ఆత్మహత్యాయత్నం!
<p>దిశ ప్రతినిధి, నిజామాబాద్ : తమ ప్రేమ పెళ్లిని ఒప్పుకోలేదనే కారణంతో ఇద్దరు ప్రేమికులు ఆత్మహత్యాయత్నం చేశారు. ఈ ఘటన నిజామాబాద్ జిల్లా డిచ్పల్లి మండల శివారులో మంగళవారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఎస్ఐ ఆంజనేయులు కథనం ప్రకారం.. నిజామాబాద్ మండల కేంద్రం గౌతమ్ నగర్‌కు చెందిన నందాల ప్రశాంత్, బాన్స్వాడ మండలం నెమలి గ్రామానికి చెందిన జ్యోతి అనే అమ్మాయి కొంత కాలంగా ప్రేమించుకుంటున్నారు. పెళ్లికి ఇరు కుటుంబాలు ఒప్పుకోకపోవడంతో సోమవారం అర్ధరాత్రి పిల్లి మండల […]</p>

దిశ ప్రతినిధి, నిజామాబాద్ : తమ ప్రేమ పెళ్లిని ఒప్పుకోలేదనే కారణంతో ఇద్దరు ప్రేమికులు ఆత్మహత్యాయత్నం చేశారు. ఈ ఘటన నిజామాబాద్ జిల్లా డిచ్పల్లి మండల శివారులో మంగళవారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
ఎస్ఐ ఆంజనేయులు కథనం ప్రకారం.. నిజామాబాద్ మండల కేంద్రం గౌతమ్ నగర్‌కు చెందిన నందాల ప్రశాంత్, బాన్స్వాడ మండలం నెమలి గ్రామానికి చెందిన జ్యోతి అనే అమ్మాయి కొంత కాలంగా ప్రేమించుకుంటున్నారు. పెళ్లికి ఇరు కుటుంబాలు ఒప్పుకోకపోవడంతో సోమవారం అర్ధరాత్రి పిల్లి మండల కేంద్రం చేరుకుని గ్రామ శివారులో ఉన్న ఎల్లమ్మ గుడి దగ్గర బ్లేడుతో గొంతులు కోసుకున్నారు. ఈ ఘటనను చూసిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. దీంతో వెంటనే ప్రేమికులు ఇద్దరినీ పోలీసులు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం ఇరువురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు ఎస్‌ఐ ఆంజనేయులు తెలిపారు.






