- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- క్రైం
- సినిమా
- కెరీర్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- జాతీయం
- బిజినెస్
- కార్టూన్
- ప్రపంచం
- ఆరోగ్యం
- స్పోర్ట్స్
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫోటోలు
- జిల్లా వార్తలు
- భక్తి
దిశ, వెబ్‌డెస్క్ : ప్రేమ జంట ఆత్మహత్యాయత్నం చేసింది. ఈ ఘటన గుంటూరు జిల్లా దాచేపల్లి మండలంలో శనివారం ఆలస్యంగా వెలుగుచూసింది. తమ ప్రేమను పెద్దలు అంగీకరించకపోవడం వల్లే ప్రేమికులిద్దరూ పురుగుల మందు తాగి చనిపోయేందుకు ప్రయత్నించినట్టు సమాచారం. గమనించిన ఇరు కుటుంబసభ్యులు వారిని వెంటనే ఆస్పత్రికి తరలించి వైద్యం అందిస్తున్నారు.
ప్రస్తుతం ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది. సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన ఘటనా స్థలికి చేరుకుని వివరాలు సేకరించారు. బాధిత కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్టు తెలిపారు. కాగా, ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Next Story