సోదరితో సహజీవనం.. సోదరుల చేతిలో బలి

74

దిశ, మహబూబాబాద్ : తమ సోదరితో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడనే కారణంతో ఇద్దరు సోదరులు ఆ వ్యక్తిని దారుణంగా కొట్టి చంపారు. ఈ ఘటన మహబూబాబాద్ జిల్లా గార్ల మండలం లో గురువారం వెలుగు చూసింది. వివారాల్లోకివెళితే.. సూర్యాపేట జిల్లా బోనకల్ మండలానికి చెందిన రాయల వెంకటేశ్వర్లు(45) లారీ డ్రైవర్‌గా పనిచేస్తూ జీవనం సాగిస్తున్నాడు. ఈ క్రమంలోనే అతను కొన్ని నెలలుగా గార్ల మండలంలోని ఓ మహిళతో పరిచయం ఏర్పడగా..

వీరిద్దరూ కలిసి సహజీవనం చేస్తున్నారు. విషయం ఆ మహిళ ఇంట్లో వారికి తెలిసింది. ఇవాళ ఒకే ఇంట్లో వీరిద్దరూ కలిసి ఉండటాన్ని గమనించిన మహిళ సోదరులు ఇనుప రాడ్ల సాయంతో లారీ డ్రైవర్ తల మీద బలంగా కొట్టారు. దీంతో అతను అక్కడిక్కడే మృతి చెందాడు. అయితే, ఈ విషయంపై స్థానిక ఎస్సై రవిని వివరణ కోరగా ఈ హత్య ఉదంతంపై ఎలాంటి ఫిర్యాదు అందలేదని తెలిపారు.

గల్లీ టూ గ్లోబల్ అప్డేట్స్.. రంగులు మారే రాజకీయాలపై ఆసక్తికర విశ్లేషణలు.. దమ్మున్న వార్తలు.. ఎప్పటికప్పుడు.. వాట్సాప్ ద్వారా పొందాలంటే.. మా నెంబ‌ర్‌ +91 88864 24242 ను సేవ్ చేసుకొని, "START" అని వాట్సాప్ ద్వారా మెసేజ్ పంపండి..