తూటా మాట్లాడుతుంది

by Disha edit |
తూటా మాట్లాడుతుంది
X

కలం గులాం అయితే

పాట నోరు మూగబోతే

నాటి బాంచన్ దొరకు

నేటి దొర భజనకు తేడా ఏమిటి

నీతి మాటలు చెప్పే పెద్దలు

నేతల నేతి భోజనాలకు మరిగితే

అడగాల్సిన మేధా(తా)వుల నోళ్లకు

గడ్డి అడ్డం పడుతుందా

సాహిత్యం ప్రజల హితం మరచి

పురస్కారాలకు నమస్కారాలు చేస్తే

పేలే గన్నులన్నీ ఉన్నోడి

గోడమీది బొమ్మలైతే!

కుందేళ్ళు లేళ్లు ఒక్కటై

పులులకు బావులు చూపిస్తాయి

పెద్ధల గద్దలను వేటాడడానికి

కాకులు కాళ్లకు కత్తులు కట్టుకుంటాయి!

విహంగాలు రెక్కలకు

నిప్పుల మూటలు కట్టుకొని ఎగిరొస్తాయి

రైతు గోసతో నాటిన ప్రతి విత్తనం

తుపాకై మొలకెత్తుతుంది!

మల్లెలు అడవుల్లో అగ్నిపూలయి

విప్లవాలను వెదజల్లుతాయి!

మాట మౌనందాల్చితే

తూటా మాట్లాడుతుంది!!

జగ్గయ్య.జి

9849525802


Next Story

Most Viewed