కవిమాట: లాలూచీ

by Disha edit |
కవిమాట: లాలూచీ
X

ఎందుకు తమ్ముడూ !

ఇంత వంగ మంటే

కాళ్ళ మీద పడడం దేనికి మంచిది తమ్మీ!

సంకకు ఎత్తుకుంటే రావు, దించితే నడవవు

కూట్లె రాయి తీయలేనోడు యేట్లె రాయితీస్తాడా అన్నా!

త్యాగాల మరిచి

దర్బార్ గార్దభ రాగాలు ఆలపించడం

వెన్నుపోటులా పెన్నుపోటు పొడుస్తున్నావ్

తమ్మీ, బాట్లు లేని తరాజుతో

నీ జోకుడు చూస్తే డోకు వస్తుంది

నీ మెదడులో ఎప్పుడు చెదలు పుట్టింది

నీ ఆలోచనలకు ఎప్పుడు చిలుం పట్టింది

నిన్ను చూస్తే అవమానంతో

అక్షరాలే అక్షరాల సిగ్గు పడి పోతున్నాయి

ఆ కుర్చీలో

ఇంకొకరు వచ్చి కూర్చున్నా

వారి పాటే మరింత సిగ్గు ఎగ్గూ లేకుండా

లొటపెట పెదవులకు నక్క ఆశ పడినట్టు

తాళం కొడతావని స్తుతి కీర్తనలు పాడుతావని--

ఎత్తిన పిడికిలి నీ మొఖం మీద గుద్దుతుంది

గొంతెత్తిన నినాదం

నీళ్ల మీది దెబ్బలా వినబడుతుంది

ఇది నీకు మునాసం కాదు తమ్మీ!

వ్యూహాత్మక మౌనం మరింత ప్రమాదకరం అన్నా !!

జూకంటి జగన్నాథం

Also Read..

కవిత: శాంతి.....క్రాంతి


Next Story

Most Viewed