నవ విజయం

by Ravi |   (  Updated:2026-07-27 01:15:56  IST  )

Poem

నవ విజయం
X

యుద్ధం నినాదం కాదు

మౌనం శాంతి సందేశం కాదు

తుఫాను ముందు

ప్రశాంతతే 'సత్యాగ్రహం'

ధర్మ విరుద్ధ పాలనకు

దిక్కార స్వరాలే

సమర శంఖాలు

చరిత్ర పాఠాలు నేర్వని

నేతల తలరాతలు

ప్రతి తరం సరిదిద్దుతూనే ఉంటుంది

చలిమర గదుల్లో కూర్చుని

చెక్కే శాసనాలు

సామాన్యుల బతుకుల్ని

నిప్పుల కొలిమిలో నెట్టేస్తున్నాయి

అజ్ఞానమే అర్హత గల నేతలు

అంగట్లో సరుకుగా

విద్యను అమ్మేస్తున్నారు

ఈ జంతర్ మంతర్ విజయం

యువత అంతరంగంలోంచి

ప్రతిధ్వనించిన నవ విజయం..

- శ్రీనివాస్ కాలె

90594 50418

Next Story