జ్ఞానమే గెలిచింది...

by Ravi |   (  Updated:2026-07-27 01:00:54  IST  )

Poem

జ్ఞానమే గెలిచింది...
X

చలి చీమల చేత చిక్కి చచ్చినట్లు..

బొద్దింకలు నీట్‌ను చుట్టుముట్టి

అ'ధర్మా'న్ని ఓడించాయి..

వాళ్ల దేహాలనే కాదు..

వారి హృదయాల మీద

కషాయ మూకలు విషం చెప్పినా..

ఆమ్ముడు పోయిన మీడియా..

కలాన్ని గలాన్ని మూసుకున్నా..

జంతర్ మంతర్‌లో.. నిత్యనిర్బంధాన్ని

చప్పట్లతో గెలిచిన యువ చేతనం..

పగిలిన తలల.. చెందిన నెత్తుటి సాక్షి

అన్యాయాల అక్రమాల అజ్ఞానంపై అజాదీ

అంటూ..ఢిల్లీలో జ్ఞాన బు(బొ)ద్దింకలు..

ప్రజాస్వామ్యాన్ని, పోరాడే స్ఫూర్తిని

రేపటి భవిష్యత్తుని వెలిగించాయి

యువత.. ప్రజాస్వామ్యాన్ని గెలిపించారు..

జ్ఞానమే గెలిచింది

అజ్ఞానం రాజీనామా చేసింది..

జయహో జెన్ జీ..

-సహచరి

94409 70454

Next Story