- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు

తొలకరి జల్లులా వచ్చిన స్నేహం
మనసంతా చల్లని పరిమళాన్ని నింపింది.
ఆ జల్లే జీవితానికి ప్రశాంతత
అని నమ్మిన హృదయం,
ఒక రోజు అదే జడివానై
తన ప్రపంచాన్నంతా
అల్లకల్లోలం చేస్తుందని ఊహించలేదు.
జల్లులో పరవశించి తడిసిన మనసు,
జడివాన ఉధృతిని తట్టుకోలేక
తనలో తానే మౌనంగా విరిగిపోయింది.
ప్రతి జల్లూ శాశ్వతమైన చల్లదనం కాదని,
కొన్ని జల్లులు
జడివానకు నిశ్శబ్ద హెచ్చరికలని
ఆ అమాయక హృదయం
తెలుసుకోలేకపోయింది.
అందుకే... జల్లు బాగుందని
ప్రతి వానలో తడవకు.
కొన్ని వానలు ప్రేమగా పలకరించి,
ప్రళయంలా మారి నిన్నే ముంచేస్తాయి.
తొలకరి జల్లుకు హృదయం ఉండదు...
నీ హృదయం ముక్కలైనా,
అది తన దారిన తాను వెళ్లిపోతుంది.
నీ మనసులో తనకోసం
ఎంత ప్రేమ దాచుకున్నావో
దానికి తెలియదు... తెలిసినా,
ఆ ప్రేమను తిరిగి ఇవ్వాలనే తపన
దానికి ఎప్పుడూ ఉండదు.
కొన్ని స్నేహాలు...
తొలకరి జల్లులా వస్తాయి,
జ్ఞాపకాలుగా మిగిలిపోతాయి;
కానీ హృదయంలో మాత్రం
జడివాన వదిలిన గాయాలను
శాశ్వతంగా విడిచిపెడతాయి.
-రామిశెట్టి కావ్య
93907 21569
- Tags
- Poem






