ఇంకెందుకు వీళ్లు?

by Ravi |   (  Updated:2026-07-13 01:00:46  IST  )

Poem

ఇంకెందుకు వీళ్లు?
X

ఇంకా ఆలస్యమా?

ఇంకేమి చర్చలు జరగాలి?

చూస్తుంటే

రక్తం మరుగుతుంది

వింటుంటే మనసు వికలమవుతుంది.

ఆ విషపాదముద్రలను

కడిగేముందే

కాళ్ళు నరికేయండి..

ఆ ముళ్ళ చూపులు

విరిచే ముందే

కను గ్రుడ్లను పెకిలించండి.

పసి జీవితాన్ని

ఛిద్రం చేసిన పాపానికి

జననాంగాలను బలి ఇవ్వండి.

బలిసిన ఆలోచన

వెనుక బలాన్ని

జనం మధ్యలో కప్పెట్టండి.

కర్కశ బుద్ధి

పడగ విప్పిన

విష వాంఛను నడి వీధిలో

ఉరి తీయండి

ఇంకో రోజు ఆలస్యమైనా

భూమి భరించలేదేమో ఈ పాపం.

ఇంకెందుకు వీళ్లు?

మనుషులని పిలువ లేని వీరికి

బతికే హక్కే లేదు.


( రాజస్థాన్‌‌లో బాలికపై రేప్ ను ఖండిస్తూ)

-చందలూరి నారాయణరావు

97044 37247

Next Story