- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు

X
అన్ని మొక్కలకి నీళ్లు పడుతూ
తోటమాలి శ్రద్ధతో
కొన్ని కృతజ్ఞతలు చెబితే కొన్ని చెప్పవు
అదే కర్తవ్యంతో రోజూ నీళ్ళు పడుతునే
నెలల కాలవ్యవధిలో కొన్ని పూలు
పూసాయి కొన్ని పూయలేవు
పూయని మొక్కలన్నీ సమావేశమై
నిలదీసాయి తోటమాలిని చెంత చేరి
చింత వద్దు వెనుక ముందు అంతే
పూస్తారు కత్తులూ కాస్తారు
రేపు సాయం సంధ్యలో
రక్తవర్ణ పూలు ఇస్తారు
ధైర్యం చెప్పాడు తోటమాలి వినమ్రంగా
సృష్టి తీర్పే అంతిమం
కానీ ప్రయత్నమెప్పుడు
అంతం కా(రా)దు
-కోటం చంద్రశేఖర్
94920 43348
- Tags
- Poem
Next Story






