- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు

X
ఒకే గూడు...
సంద్రంలో దీవిలా
ఎవరి లోకం వారిది.
మాటల పంటలు పండిన చోట,
నిశ్శబ్దం అలుముకున్న వేళ
అంతా ఒంటరితనమే!
అరచేతిలో ప్రపంచాన్ని బంధించి,
అంగుళపు దూరానున్న మనసును చేరలేక,
అంతర్జాల మాయలో చిక్కిన మనుషులు!
నాడు... చలువ చంద్రునితో కబుర్లు,
నేడు... నీలి తెరల వెలుగుల్లో
నిశ్శబ్దంగా కరిగిపోతున్న రాత్రులు!
ఆప్యాయత నదులు ఇంకిపోయి,
స్క్రీన్ వెలుగుల ఎడారి విస్తరించి,
మనసుల దాహం తీరక
ప్రేమ చినుకులకై పరితపిస్తున్నాయి!
సుదూరపు దృశ్యాలను వీక్షిస్తూ...
పక్కనే ఉన్నా ఎప్పటికీ కలవని కనుపాపలై
మిగిలిపోతున్నాయి మానవ సంబంధాలు!
-డా. ఆవుల రేణుక
93982 68976
- Tags
- Poem
Next Story






