అశ్రు భాష

by Ravi |   (  Updated:2026-06-29 00:30:42  IST  )

Poem

అశ్రు భాష
X

కళ్ళు మాట్లాడతాయి

కళ్ళు నవ్వుతాయి

కళ్ళు వర్షిస్తాయి

భావోద్వేగాలకి కన్నీళ్లు

భాష్యం చెపుతాయి..

గది దాటని కన్నీళ్లు కొన్ని

తన బాధను ప్రపంచ బాధ చేసి

విశాల విశ్వమంతా

వర్షించే కన్నీళ్లు కొన్ని!

ప్రతి కన్నీటికీ భాష ఉంటుంది

ప్రతి కన్నీటి వెనకా కథ ఉంటుంది

మాటలు మౌనం వహించినప్పుడు కన్నీరే

భాషై కథ చెపుతుంది

కన్నీటికి అవమాన భారాలు తెలుసు

సంతోషాలు, ఆనందాలు,

కృతజ్ఞతలు, పశ్చాత్తాపాలు తెలుసు

నవ్వినా, ఏడ్చినా జల జలా

ప్రవహించటానికి సిద్ధంగా ఉంటాయి

కొందరి జీవిత పర్యంతపు

వ్యధలను మోస్తూ

కన్నీళ్లు నిరంతరం

రహస్యంగా వర్షిస్తూనే ఉంటాయి.

-డాక్టర్ చెంగల్వ రామలక్ష్మి

63027 38678

Next Story