- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు

X
మళ్లీ బడిబాట పట్టాం మేము,
మురిసే మనసులతో వచ్చాం మేము.
సెలవుల జ్ఞాపకాలు సంచిలో పెట్టి,
కొత్త ఆశలతో తరగతిలో అడుగుపెట్టి.
నల్లబల్ల మమ్మల్ని పలకరిస్తుంటే,
పుస్తకాల సువాసన మనసును తాకుతుంటే.
గురువుల మాటలు దీపాలవుతాయి,
మా భవిష్యత్ దారులు వెలిగిస్తాయి.
స్నేహితుల నవ్వులు పూలై విరుస్తాయి,
బడిమైదానాలు సందడిగా మారుస్తాయి.
అక్షరమొకటి సంపదగా దాచుకుంటాం,
అవగాహనతో అడుగులు ముందుకు వేస్తాం.
ఆటలో ఆనందం నేర్చుకుంటాం,
పాటలో పరిమళం పంచుకుంటాం.
మంచి మాటలు మనసులో నాటుకుంటాం,
మంచి పిల్లలుగా ఎదగాలని తలచుకుంటాం.
మేమే రేపటి భారత దీప్తులం,
మేమే జ్ఞానవీధిలో వెలిగే జ్యోతులం.
మళ్లీ బడిబాట పట్టాం మేము,
కలలను నిజం చేసేందుకు వచ్చాం మేము!
-సాధన
- Tags
- Poem
Next Story






