- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్

X
మేఘం తనను తాను
కరిగించుకుని.. మట్టికి రాసిన
కొత్త ప్రేమలేఖ ఈ వాన
వానంటే కేవలం నీరు కాదు..
ఎండిన భూమి గుండెకు
ఆకాశం చిలికిన పన్నీరు!
మౌనంగా ఉన్న మట్టి..
ఆకాశంతో సంభాషణకి
పరిమళమే సాక్ష్యం
వడగండ్ల వానలో
వణికిన కాగితం పడవ...
పిల్లల హోరు సముద్రాన్నే గెలిచింది
ఆకాశ ధార
నేలమ్మకు ముద్దులు
పచ్చని పంట!
వానంటే
భూమికి ఆకాశం
రాసే ప్రేమలేఖ!
వాన చినుకులు
కొబ్బరి ఆకుల పియానో
పిల్లల అల్లరికి తాళం.
-తరిగొప్పుల విఎల్లెన్ మూర్తి
80085 77834
- Tags
- Poem
Next Story






