గమనం

by Ravi |   (  Updated:2026-05-10 23:45:14  IST  )

Poem

గమనం
X

కాలం వెంట

నువ్వు నడుస్తూ వెళ్ళు అంతే..

నువ్వు చెయ్యలేని పనులు

కాలమే భుజాన వేసుకుంటుంది

అలా అని నువ్వు

జీవచ్ఛవంలా ఉంటే కుదర్దు

కాలంతో మమేకం కావాలి

కాలానికి తోబుట్టువల్లే

సంచరించాలి

వేడిని తడిని అలజడిని

బాధ్యతగా భరిస్తూ వెళ్ళూ

ఋతువులు మారుతూ

వసంతం వచ్చేస్తుంది నీలోకి...

-డా.రమేష్ కటుకోఝ్వల

99490 83327

Next Story