- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు

X
నెత్తురు చిందించి
నింగిన ఎగిరేసిన జెండానే మేడే
శ్రమ విముక్తి రాగంగా
ఆలాపన చేస్తున్న
పీడిత పక్షపాతి ఈ మేడే..!
చికాగో నగరం మీదుగా
వీచిన పోరు గాలి
భారత నేలలోని
బొంబాయి కాన్పూరు
కలకత్తాలను ఏకం చేసి
రోడ్ల మీద నినదించిన
కోట్లాది శ్రామిక జన స్వరమే
ఈ మేడే…!
స్వేచ్ఛా స్వాతంత్రాలకై
సమరశీల పోరాటాలను
సాగించిన కార్మికోద్యమం
పనిగంటల తగ్గింపులో
శ్రమకు తగ్గ వేతనం దక్కాలని
చాటినదే ఈ మేడే..!
-వంగల సంతోష్
95737 86539
- Tags
- Poem
Next Story






