మనుషులే యంత్రాలుగా...

by Ravi |   (  Updated:2026-05-04 00:31:01  IST  )

Poem

మనుషులే యంత్రాలుగా...
X

డబ్బే ప్రాణం... స్వార్థమే దైవం!

జనారణ్యంలో ఉన్నా...

వెక్కిరిస్తున్నది ఒంటరితనం!

ఆర్తనాదం వినబడితే...

సెల్ఫీలు తీసే వింత నైజం,

కన్నీరు కళ్లెదుటున్నా

కరిగిపోని కఠిన శిలా హృదయం!

నకిలీ నవ్వుల వెనుక

దాగిన తీరని నొప్పులు,

'స్టేటస్'ల ప్రదర్శనలో బంధాలు!

చదరంగం ఆటలా మారిన జీవితాలు,

ఒక్క ‘లైక్’ కోసం

పరుగుతీస్తున్న వృధా రోజులు!

అవసరాన్ని బట్టి రంగులు

మార్చే విలువలు,

మనసును మర్చిపోయిన

యంత్రపు మనుషులు!

మంచి - చెడుల మధ్య గీతలు

ఎప్పుడో చెరిగిపోయాయి,

సౌకర్యమే నేటి సమాజానికి

సత్యమై నిలిచింది!

సమయం లేదు...

సందర్భం అంతకంటే లేదు...

ఆవేశమే ఇప్పుడు నిర్ణయాలను

శాసించే యజమాని!

సంతోషం కోసం

గుడ్డిగా పరుగెడుతున్నాం,

అంతరంగపు శాంతిని

ఎక్కడో పూడ్చిపెడుతున్నాం!

వెనక్కి తిరిగి చూసుకుంటే...

మిగిలేది శూన్యం,

చివరికి…

మనం కోల్పోయింది

ఈ ప్రపంచాన్ని కాదు,

మనల్ని మనమే!

-రాచకొండ సాగర్

70958 22883

Next Story