- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు

నేటితో కాలవృక్షం నుండి
ఒక ఆకు రాలిపోనుంది
రేపటి నుండి కొత్త కొత్త ఆశలతో
'పరాభవ'మొకటి చిగురేయనుంది!
పోతూ పోతూ యుద్ధ భయాల్ని నింపి
ఇంటింటా పొయ్యి వెలగని రోజుల్నిచ్చి
'విశ్వావసు' చేతులు దులిపేసుకుంది!
కాల పరీక్షకు నిలబడటమే జీవితం
నాకు తెలిసీ
ఏ పంచాంగమూ లిట్మస్ టెస్టుకు నిలబడలే
అయినా దాన్ని ప్రతి ఏడాది కొనడం
ఒక అసంకల్పిత చర్య!
ఉగాది పచ్చడికున్న శాస్త్రీయత
పంచాంగ శ్రవణంలో లేదు
ఆరు రుచులు
మనిషి జీవన పార్శ్వాలకు ప్రతీకలు!
అన్ని రుచుల అనుభవమే
జీవన సాఫల్యానికి పరిపూర్ణత!
గెలుపోటములు దాగుడుమూతలే
ఉప్పొంగడం ఊసురుమనడం
విజేతల లక్షణం కానే కాదు
కాలానికిట్లా వీడ్కోలు స్వాగతాలు పలకడం
మనలో కొత్త చైతన్యం ననలెత్తడానికే!
రానీ.... 'పరాభవా'నికి స్వాగతం పలికి
మనిషి విజయాలను రుచి చూపిద్దాం!!
- కోట్ల వెంకటేశ్వర రెడ్డి
94402 33261
- Tags
- Poem






