అమ్మ

by Ravi |   (  Updated:2026-03-22 23:45:55  IST  )

Poem

అమ్మ
X

మానవ జాతి పెదాలపైన

అందమైన పదం ‘‘అమ్మ’’

అన్నిటికంటే అందమైన

పిలుపు ‘‘మా అమ్మ’’

ప్రేమ, నమ్మకం నిండిన పదం.

గుండె లోతుల నుంచి దయ,

మాధుర్యం నిపుంకుని వచ్చిన పదం.

అమ్మే సర్వస్వం

మన బాధల్లో ఓదార్పు

మన దుస్థితిలో ఒక విశ్వాసం

మనం బలహీనంగా

ఉన్నప్పుడు మనకు బలం

ప్రేమకు, దయకు, సానుభూతికి,

మన్నించడానికి అమ్మే మూలం.

ఎవరైనా అమ్మని కోల్పోతే,

నిత్యం రక్షిస్తూ, దీవిస్తున్న

స్వచ్ఛమైన ఆత్మని కోల్పోయినట్టే.

ప్రకృతిలో ప్రతిదీ

అమ్మతో మాట్లాడుతుంది.


(మా అమ్మ ఆలూరు విమలాదేవి 94వ జయంతి సందర్భంగా)

మూలం: ఖలీల్ జీబ్రాన్

అనుసృజన : రాఘవ

94932 26180

Next Story