- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు

X
బ్రతకడమే యుద్దమైన చోట
మళ్లీ మళ్లీ వాళ్లు యుద్ధాన్ని ప్రకటిస్తారు
ఈ దేశ పౌరులమైన మేము
మా దేశం పట్లా …!
అని ప్రతిజ్ఞ ముగియకుండానే,
వాళ్లంతా అభియోగం మోపబడి
శిక్షించబడ్డ ఖైదీలా
ఓ సరళరేఖ మీద నిలబడి
దురాక్రమణ సెగల్లో కాలిపోతారు
మిగిలిన వాళ్లంతా
రాలిపోయిన వాళ్ళ బూడిదను
కుప్పలుగా పోసి రోధిస్తారు
తెల్లారాక యుద్ధంలో
వీరమరణం అనే ప్రకటన
ఏ చితికిన బతుకుల్ని అతికించగలదు
ఏ మెతుకుల్ని పండించగలదు
దేశాన్ని ప్రేమించడం అంటే
యుద్ధంలో మరణించడం
అని తెలిసిపోయింది
దేశం కోసం యుద్ధాన్ని
ప్రకటించిన వాడు మాత్రం
ఇంకా ఎందుకు మిగిలిపోయాడో
నాకు అర్థం కాలేదు
-పి.సుష్మ
99597 05519
- Tags
- Poem
Next Story






