బంధం

by Ravi |   (  Updated:2025-08-04 00:46:05  IST  )

Poem

బంధం
X

వెండి తీగలుగా మారిన నీ కేశాలు

ముఖం పై గీతలు

నా ప్రేమకు అవరోధాలు కావు

మతిమరుపుతో నువ్వు ప్రతిదీ

మర్చిపోతున్నా

అయోమయావస్థలో ఒక పని

చేయబోయి, మరొకటి చేస్తున్నా

నీ మాట తడబడుతున్నా

చేతులు వణుకుతున్నా

అల్జీమర్‌తో నన్ను నువ్వు

గుర్తు పట్టక పోయినా

నేను నిన్ను ప్రేమిస్తూనే ఉంటాను

భౌతికంగా, మానసికంగా నువ్వు

నా మునుపటి నువ్వు కాకపోయినా

నీ జీవిత వసంతంలో ఎలా ప్రేమించానో

శిశిరంలోనూ అలాగే ఉంటా!

నా స్పర్శానురాగాలతో

నీలో వసంతోత్సాహాన్ని నింపుతాను.

డా. చెంగల్వ రామలక్ష్మి

63027 38678

Next Story