- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు

సూడాన్ ముస్లిం ఎవరినైనా కోపంతోనో,
ద్వేషంతోనో చంపేసాడనుకోండి!
ఫేస్ బుక్ లో "అరే
ఏమైనా మాట్లాడు దీనిగురించి..
అతను టెర్రరిస్టా కాదా" అంటూ
నా ఫ్రెండ్ నన్ను ట్యాగ్ చేస్తుంది.
అసలు అందరు టెర్రరిస్టులూ
ముస్లింలే ఎందుకయ్యారు?
అక్కడెక్కడో ఒక అరబ్బు దేశంలో
ముస్లిం దగ్గితే, ముస్లిం కానివాడికి
జలుబు చేసిందనుకోండి!
నా ఇండియా దోస్త్..
చెప్పు ఇది జిహాద్ కాదా..
మాట్లాడు ఎందుకు మౌనంగా ఉన్నావు?
అంటూ నన్ను నిలదీస్తాడు.
కశ్మీర్‌లో టెర్రరిస్టులెవరో
మనుషుల్ని చంపితే కూడా
జిహాదుల్లారా, మిమ్మల్ని కూడా
పాలస్తీనియుల్లాగా చంపి పడేయాలంటూ
నా దోస్త్ నామీద ఆగ్రహంగా పెద్దగా అరుస్తాడు.
కుట్రదారులారా, పాకిస్తాన్‌కి వెళ్ళిపొండి
లేదా బంగ్లాదేశ్ కి వెళ్ళిపొండి, అని
రెచ్చి పోతూ గావుకేకలు పెడతాడు.
నేను ఆశ్చర్య పోతుంటాను.
అసలు, నాకు సుడానీలు ఎవరో తెలీదు.
అరబ్బులెవరో కూడా తెలీదు.
కానీ నన్ను ఎప్పటి నుంచో ప్రేమిస్తూన్న,
నాకిష్టమైన రంగేదో తెలిసిన,
నా తొలి ప్రేమ ఎవరితోనో పసిగట్టిన ,
నా పుట్టిన రోజు తెలిసిన
నా స్నేహితురాలికి
ప్రియమైన పొరుగుదాన్ని మాత్రమే!
ఇప్పుడిక విచిత్రం ఏమిటంటే,
నా స్నేహితురాలు స్క్రీన్ ముందు కూర్చుని
నాగురించి టీవీ ఛానెల్స్‌లో చెబుతుంటే వింటూ,
నన్ను కొత్తగా అర్థం చేసుకుంటూ ఉంటుంది!
అరే కుచ్ తో బోలో?
అంటూ నన్ను ఫేస్ బుక్‌లో ట్యాగ్ చేస్తుంది!
(అరే కుచ్ తో బోలో)
మూలం - మౌమితా ఆలం
అనుసృజన: గీతాంజలి
- Tags
- Poem






