మొలకలు

by Ravi |   (  Updated:2025-07-28 00:46:17  IST  )

Poem

మొలకలు
X

పవళింపు సేవలో ఒత్తిగిల్లాడు

మొక్కులు కస్సున దిగాయి

మంచుకొండల్లో పరవశించే వేళ

కాలుష్యం కోర విసిరింది

భూమిపై రూపెత్తి

కడుపులో రూపుమాసింది గింజ

వాన వెలిసింది

తడి పొడి చిత్తడి

పక్షి జాలం మబ్బుల్ని ముద్దాడింది

పట్టన పగిలాయి

గొంతు వరకు నీరు

అల్లల్లాడుతూ ఆకు

బాధ్యతల మంచుశిల

కష్టాల్లో కాగితే తప్ప

నీరై ప్రవహించదు

బి.వి.ఎన్.స్వామి

92478 17732

Next Story