- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు

X
సముద్రం నిత్య చైతన్యం
నిరంతర చలనం!
అసంఖ్యాక నీటి బిందువులు
సంఘటితమై సమరోత్సాహంతో
కెరటాలై ఉవ్వెత్తున ఎగసిపడే తీరు
ఆటుపోట్ల అలజడితో
సాగర ఘర్జన హోరు
ఉత్తేజం నింపవా?
స్పూర్తిని రగిలించవా?!
అలుపెరగక అలలు ఉప్పొంగితే
విరామమెరుగక ముందుకు సాగితే
తీరాన్ని తాకితే లక్ష్యాన్ని చేరితే
గెలుపు పాట వినిపించదా?
సంకల్ప బలం చాటదా!
నిశ్చల కడలి నిగ్రహమొదిలి
కన్నెర్రజేస్తే, ఉగ్రరూపం దాలిస్తే
పోటెత్తదా, హోరెత్తదా
ఉప్పెనై ముంచెత్తదా?!
ధవళేశ్వరపు రవికుమార్
98487 12197
- Tags
- poem
Next Story






