- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు

X
నేనో ప్రాణం లేని పసికందును
నన్ను అక్రమ సంతానం అన్నారు కొందరు
ఆడపిల్ల అన్నారు మరికొందరు
కానీ అన్యం పుణ్యం
ఎరుగని పసికందును నేను
నన్ను నవ మాసాలు మోసిన తల్లి
పెంచే స్తోమత లేని తండ్రి
నన్ను వదిలించుకోవాలి అని
పత్తి చేనుల్లో, ముళ్ళ పొదల్లో,
మురికి కాలువల్లో పడేస్తే,
వెక్కి వెక్కి ఏడుస్తున్న నన్ను
ఏ కుక్కో పీక్కు తునకముందే
ఎవరైనా దయగల మహారాజులు
నన్ను చూసుంటే, మాత లేని నన్ను,
ఏ మాత శిశు సంక్షేమ
గృహంలో వదిలేసుంటే
నేను బ్రతికి, నేడు ఆహుతవుతున్న
మానవ సంబంధాలను
అగ్ని నేత్రంతో సరిచేసి,
మరెందరో పసికందులకు
అన్నప్రాసం చేయించి, అసువులు బాసిన
నాలాంటి పసికందులకు అంకితం ఇద్దును.
జక్కుల శ్రీనివాస్,
97019 38358
- Tags
- Poem
Next Story






