అమ్మమ్మగారిల్లు!

by Ravi |   (  Updated:2025-07-28 00:30:43  IST  )

Poem

అమ్మమ్మగారిల్లు!
X

ఎన్నెన్నో జ్ఞాపకాలనిచ్చిన గడపలు,

ఎంత వెతికినా కానరాని బాధలు,

బాధ్యతల్లేని పరువాలు,

మరిచిపోలేని తీపి గుర్తులు..

స్నేహితులతో, అక్కా చెల్లెళ్లతో చేసిన అల్లర్లు,

వెలకట్టలేని మధుర క్షణాలు...

అమ్మమ్మ ఆప్యాయతతో,

తాతయ్య అనురాగంతో

గడిచిన వేసవులు మాకే తెలుసు.

ఇంటిల్లిపాది మనుషులతో కళకళలాడితే,

ఉప్పొంగిపోయేవి ఆ రెండు హృదయాలు.

ఒక్కో పగలూ ఊహలతో పులకించేది

ఒక్కో రాత్రీ కథలతో నిండిపోయేది

సెలవులు రాగానే ముందు గుర్తొచ్చేది

వాట్సాప్ కాదు... వీడియో గేమ్స్ కాదు..

అమ్మమ్మ గారిల్లు!

వెకేషన్ అంటే 'అమ్మమ్మ గారిల్లు'

అని తెలియని ఈ జనరేషన్ వినాలి...

అదే మా ప్లే స్కూల్,

అదే మా కిండర్ గార్టెన్,

అదే మా మొదటి జీవిత పాఠశాల!

- దివిజ

Next Story