ఇదీ జీవితం

by Ravi |   (  Updated:2025-03-09 23:30:44  IST  )

Poem

ఇదీ జీవితం
X

ప్రేమించు, ప్రేమను పొందు

ఎప్పుడూ నీ అల్పత్వాన్ని మర్చిపోకు

చుట్టూ జరిగే

మాటలకందని హింసను

దారుణ అసమానత్వాలను

మరిచిపోకు

అత్యంత విషాద పరిస్థితుల్లోనూ

సంతోషాన్ని వెతుకు

అబద్ధాలకోరుకు

అందమేమిటో చెప్పు

సంక్లిష్టమైన దానిని సాధారణంగానూ

సాధారణమైన దానిని సంక్లిష్టంగా చూపెట్టకు

మసక వెల్తురులో దారితప్పకు

నీ బలాన్ని గుర్తించు

అహంకారాన్ని కాదు

ఎప్పుడూ గమనిస్తూ ఉండు

ప్రయత్నిస్తూ ఉండు

అర్థం చేసుకుంటూ ఉండు

ఎప్పుడూ పారిపోకు

ఏమారిపోకు

ఉదయమిత్ర

891 965 0545

Next Story