వొక సత్యం...

by Ravi |   (  Updated:2025-03-09 23:45:18  IST  )

Poem

వొక సత్యం...
X

జీవిత దారానికి

పుట్టుక మొదలు

కొసకి వేలాడుతూ

పిడికెడు మెతుకుల కోసం

ఎన్ని యుద్ధాలో

కన్నీళ్లు

కష్టాలు దోసిళ్ల నుంచి జారిపోతూ

అంతా శూన్యమే

దోచుకోబడుతూ

దాచుకొలేనితనాన్ని

డొల్లతనం

జీవితమంటే మట్టిలో పుట్టి

మన్నులో కలవడమే

చావు చివరి మలుపే

దారపు చివరి కొస

ఇంతే ఇదే వొక గొప్ప సత్యం!!

- పుష్యమీ సాగర్

79970 72896

Next Story