- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు

X
అనగనగా ఓ తల్లికోతి,
దానికి ఓ పిల్లకోతి
తల్లికోతి ఏ తోటలోనో దూరి
ఏ చెట్టు మీదనో చేరి
పళ్ళు కాయలు తెచ్చి
పిల్లకోతికి ఆహారంగా ఇస్తుంది
ఆకలితో కన్పిస్తే
తల్లడిల్లిపోయే తల్లికోతి
ఇలా రోజులు గడుస్తున్నాయి
పిల్లకోతికి ఇంకా నెలలే
ఒక రోజు తనతో వస్తానని మొండికేసింది
ఇద్దరూ కలిసి ఒక పార్కులో దూరారు
కాపలావాడు కనిపెట్టి కర్ర విసిరాడు
తప్పించుకొనే ప్రయత్నంలో
గాయపడ్డది పిల్లకోతి
కోతులు జీవించే హక్కును
గౌరవించేవాళ్ళు లేరా
చిన్న పెద్ద చూడరా?
ప్రకృతి మాది,పెత్తనం మీది
మేం కోతులం
నీతులు వల్లించే
కోతులు మీలో ఎందరో!
కోటం చంద్రశేఖర్
94920 43348
- Tags
- Poem
Next Story






