జ్ఞాపకాల అల్మారా

by Ravi |   (  Updated:2025-03-02 22:45:20  IST  )

Poem

జ్ఞాపకాల అల్మారా
X

పసిబాలనై పరిగెత్తలేదు

ఆటల పందిట్లోను లేను

అమ్మ ఒడిని ఎప్పుడో దిగేసాను

స్మృతుల చిహ్నాలు లేవు

కలబోతల కలలు మిగలల లేదు

ఆటపాటల ఆనవాళ్ళు లేవు

కాయంపై లాంతరు వేసే అవసరం లేదు

యువతిగా జ్ఞాపకాలు తక్కువే

కాలేజీల చిందులాటలు

ప్రేమాయణాల పేలాలు పేలలేదు

సరికదా కలబోసుకోను తోడు లేరు

ఇంక జ్ఞాపకాల అల్మరాని నింపడం ఎలా

ముదిమై కొన్ని మాత్రమే

మిగుల్చుకుని నిప ప్రయత్నం చేసాను

హెచ్. అరుణకమల

96764 43185

Next Story