- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు

X
ఏది చేజారనివ్వకు
అంగడిలో కొన్న వస్తువునైనా
అందరిలో కోరుకున్న జీవితానైనా
చాలా మంది
ఒక వస్తువును కొనాలంటే
ఎన్నో రకాలుగా ఆలోచిస్తారు
మరెన్నో విధాలుగా విచారిస్తారు
అయినా ఆ వస్తువును చేజిక్కించుకొని
సొంతం చేసుకోవడానికి
వెనుకాడుతారు
విచారణలో
ఎంతో నాణ్యమైనదని తెలిసినా
అనుక్షణం అనుమానపడతారు
అనుమానం పెరిగేకొద్దీ
నాణ్యమైనది కూడా
నాసిరకంగా కనిపిస్తుంది
చివరకు దాన్ని తన చేజేతులా
నాశనం చేసుకుంటారు
అప్పటి వరకు
ఆ వస్తువు విలువ తెలియదు
తెలిసొచ్చే సమయానికి
అది చేతి నుండి జారిపోతుంది
అప్పుడు ఎంత ఏడ్చినా తిరిగి రాదు
కోల్పోయామని
కుమిలిపోవడం తప్ప
అందుకే ఏది చేజారనివ్వకు...
- ఎనుపోతుల వెంకటేష్
95733 18401
- Tags
- Poem
Next Story






