ప్రజాస్వామ్యమా మేలుకో

by Ravi |   (  Updated:2025-03-02 23:31:05  IST  )

Poem

ప్రజాస్వామ్యమా మేలుకో
X

ఎన్ని ప్రభుత్వాలు మారినా ఇంతేనా!

ఎన్ని చట్టాలు చేసినా వృధాయేనా!

మహనీయుల పుట్టినిల్లు మన దేశం

దారుణాలకు మెట్టినిల్లు మన దేశం

ఐదేళ్ళ పిల్లలపై అరాచకాలు అఘాయిత్యాలు

ఎంత కాలం ఆడపిల్ల తల్లిదండ్రులు

బిక్కు బిక్కుమని బతికేది?

ఓటుకి కల్లు సీసా కాదు అడగడం,

ప్రతి ఇంటి ఆడపిల్లకు రక్షణ

కల్పించమని అడగడం ఇంకెప్పుడూ?

బిర్యానీ పొట్లానికి రుచి మరిగిన సమాజమా

అన్యాయాన్ని ఎదురించేది ఇంకెప్పుడూ?

జరిగిన హత్యలు దారుణాలు

లెక్కించడానికే ఉంటున్న ప్రభుత్వాలు!

నడిరోడ్డులో అన్యాయం జరిగిన పట్టించుకోని

సాంప్రదాయ దేశం మనది

ఐదేళ్ళ బాలికకు స్వేచ్ఛ లేని

అత్యుత్తమ దేశం మనది

నిద్రపోతున్న ప్రజాస్వామ్యమా మేలుకో!

కె.దివ్యరాణి

77939 31269

Next Story