- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు

X
భాజాభంత్రీల మధ్యన
కళ్యాణ మంటపంలో
కళ్ళనిండా నీళ్లతో
కాళ్ళు కడిగి కన్యాదానం!
మనసారా పెంచుకున్న ప్రాణం
ఏడడుగులు వేసి వెళ్ళిపోతే
పెరిగిన ఇల్లు చిన్నబోతుంది
పెంచిన గుండెలు ద్రవించిపోతాయి!
కొత్త కొత్తగా అత్తారింటికి
కోడలుగా కాలిడితే
గుండెలకు హత్తుకునే
అత్తుంటే అదృష్టమే!
లేదంటే క్షణం క్షణం
కాలుతున్న వొత్తిలా జీవితం!
అత్తలో అమ్మను చూసే
కోడలుగా తాను ఉండాలి
ఇంట్లో దీపం వెలిగించి
వెలుగులు నింపే ఇల్లాలు కావాలి!
తమ ఇంటిపేరును నిలబెట్టి
వారసత్వాన్ని అందిపుచ్చుకునే
కోడలిలో కూతురును చూడాలి!
ఇంటి సొత్తులు, తాలపుచెవి గుత్తులు
తనకి ఇవ్వాలి, తనవే అవ్వాలి!!
అప్పుడే అత్తా మామలు అవుతారు
కొడుకుకు అసలైన తల్లిదండ్రులు!
జగ్గయ్య. జి
98495 25802
- Tags
- Poem
Next Story






