బదులులేని ప్రశ్ననై

by Ravi |   (  Updated:2025-02-23 21:45:51  IST  )

Poem

బదులులేని ప్రశ్ననై
X

పాదం వేసిన అడుగుతో నేను...

పయనమయ్యాను నాతో నేను...

నిజం వెనుక దాగిన అబద్దాన్నయ్యాను...

అంధకారంలో ఆశాకిరణానైయ్యాను...

కలల వేటలో కలసిపోయాను...

కన్నీటి సంద్రంలో అలగా మిగిలాను...

అణువణువున ఆనందాన్నైయ్యాను...

అంతులేని ఆవేదన నయ్యాను...

పొంతన లేని పోలికనయ్యాను...

అంతం లేని ఆలోచన నయ్యాను...

పాండిత్యం తెలిసిన పామరుడినయ్యాను...

ఫలితం చూడని మూర్ఖుణ్ని అయ్యాను...

జీవితసారం తెలుసనుకుంటూనే ఉన్నాను,

ఇప్పటికీ, ఎప్పటికీ...!

నా జీవితయాత్రలో బదులులేని

ప్రశ్ననై మిగిలిపోయాను...

-ధాత్రి

63748 72278

Next Story