పిల్లీ పులి

by Ravi |   (  Updated:2025-02-23 23:15:56  IST  )

Poem

పిల్లీ పులి
X

పిల్లి పిల్లి పిల్లి

ఎలుకలు పట్టె పిల్లి

ఇల్లు ఇల్లు తిరిగి

పాలు తాగె పిల్లి

చాటునుండి

మాటు వేసి

వేటను నోటను కరచి

రెప్పపాటున

గోడను దూకె పిల్లి

తెల్లని పిల్లి

నల్లని పిల్లి

పెంపుడు పిల్లి

అల్లరి పిల్లి

మ్యావ్ అంటే ఎలుక పరుగు

భౌ భౌ అంటే పిల్లి పరుగు

ఎలుకలకది పులి

కుక్కలంటే గిలి

(పిల్లల కోసం)


రేడియమ్

92915 27757

Next Story