- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు

X
జీవిత దారానికి
పుట్టుక మొదలు కొసకి వేలాడుతూ
పిడికెడు మెతుకుల కోసం
ఎన్ని యుద్ధాలో
కన్నీళ్లు కష్టాలు దోసిల్ల నుంచి
జారిపోతూ అంతా శూన్యమే
దోచుకోబడుతూ
దాచుకోలేనితనం డొల్లతనం
జీవితమంటే మట్టిలో పుట్టి
మన్నులో కలవడమే
చావు చివరి మలుపే
దారపు చివరి కొస
ఇంతే ఇదే వొక గొప్ప సత్యం!!
- పుష్యమీ సాగర్
79970 72896
- Tags
- Poem
Next Story






