- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు

అప్పట్లో దర్పానికి దర్దాకు చిహ్నం
పెద్ద లోకుల ఇండ్లలో
ఉండే అరుదైనది సాధనం
బుష్ మర్ఫీ ఫిలిప్స్ కంపెనీల
టు బ్యాండ్స్ త్రీ బ్యాండ్స్
రకరకాల ఆకారాల రేడియోలు ట్రాన్సిస్టర్లు
గది ఆ మూల నుంచి
ఈ మూల వరకు కట్టే
ధ్వని తరంగాలను ఒడిసిపట్టే
ఇండోర్ కాపర్ ఆంటెనా
గాలివాన ఉరుములు మెరుపులు వస్తే
మాటలు సరిగ్గా విన్న రాని
కర్ణ కఠోర కీచుశబ్దం
ఉదయం లేవగానే
సంగీత ధ్వని పక్క ఇంట్లో నుంచి వస్తే
ఒకానొక మధురమైన ప్రవాహ ధుని
రంజని తరంగిణి
తెల్లారి ఏడు గంటలకు టంచన్ గా
వార్తలు చదువుతున్నది గుడిపూడి శ్రీహరి
దివి వెంకట్రామయ్యల
ఉత్సుకతను కలిగించే కంఠ స్వరం
ఆ రోజుల్లో కోరిన జీవితం లేకున్నా
మీరు కోరిన పాటలు అలరించే
అర్థవంతమైన భాషా సంగీత మూటలు
మారుతి భక్తి పారవశ్యంతో ఆలపించే
ఎమ్మెస్ రామారావు హనుమాన్ చాలీసా
సుందరాకాండ లయాత్మక పాటలు
మధ్యాహ్నం ఒంటిగంటకు వచ్చే
చలం ఊర్వశి నాటికలోని
కిలకలా గలగలా నవ్వులు
ఇప్పటికీ నా చెవుల్లో ప్రతిధ్వనిస్తూ
మంత్రముగ్ధుల్ని చేస్తుంది
26వ జనవరి ఉగాది కవి సమ్మేళనాలు
వహ్వా వహ్వాలు శభాష్లు చప్పట్లు
గ్రామపంచాయతీ సామాజిక రేడియోనే
ఊరందరికీ ఆనాటి వార్తలను అందించే వేగు
ఇప్పుడైతే పెళ్లిళ్లలో
కోరికలు మోటార్ సైకిల్
హోమ్ థియేటర్ వగైరాలు
అప్పట్లో పెళ్లి పిల్లగాని వాంఛలు
రాయల్ సైకిలు జబ్బకు తగిలించుకొనే
మర్ఫీ టు బ్యాండ్స ట్రాన్సిస్టర్
పాడవోయి భారతీయుడా
ఆకులో ఆకునై
ఈ నల్లని రాళ్లలో
శ్రీ శ్రీ దేవులపల్లి సినారె ల
సుమధుర లలిత గీతాలు
టీవీ కోపంగా కన్ను తెరిచి
ఊపిరి ఆపాలను చూస్తుంది
అయినా రేడియో ఇప్పటికీ
ప్రత్యేక సహాని బినాక జనరంజక గీత్ మాలా
-జూకంటి జగన్నాథం
94410 78095
- Tags
- Poem






