- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు

X
ఏది ఏమైతే నాకేంటి
ఎవ్వరేమైతే నాకేంటి
దేశామేమైతే నాకేంటి
నా ధైర్యమే నా తోటి
చెప్పినదే విననోయి
అల్పాప్రాణమే నాదోయి
కష్టసుఖం కలదోలి
కల్మషం మదివోలి
సోత్తులోద్దు సంపదలొద్దు
సరళమైన మాటే నా సరిహద్దు
నీరు వొద్దు నిలయం వొద్దు
నిలకడలేని నా నిర్ణయం నీకసలొద్దు
ప్రేమించను శృతిమించను
ప్రేరణ కోసం శ్రమించను
ఆశీషులు ఆశించను
అభివృద్ధిని అందించను
కరుణించని కాలంతో నాకేంటి
కర్తవ్యం విడవని నాకు సాటేంటి
డి. మధు సూదన్
81848 38759
- Tags
- Poem
Next Story






