- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు

X
ఎవరూ అక్కరలేదు
ఒక్క స్మార్ట్ ఫోన్ ఉంటే చాలంటాను..
ఉన్ననాడు లేనినాడు
ఒకే ఒక్క స్మార్ట్ ఫోన్ అంటాను
అదే స్వర్గం అదే నిత్యం
అదే సత్యం అదే ప్రాణం
అదే ఊపిరి... అదే సర్వస్వం..
ఉన్న నాడు లేని నాడు
ఒకే ఒక్క స్మార్ట్ ఫోన్
కావాలంటాను..
ఆ అరచేతిలోని ఫోనే
నా జీవితం
నా అద్భుత ప్రపంచానికి
అదే దర్పణం..
వేరే మనుష్యులు నాకేల
వేరే ఊసులు నాకేల
వేరే ఆటలు నాకేల
ఈ మనుష్యుల గోల నాకేల
ఇహ లోకంతో పనేల?
నా లోకమే వేరైతే..
నా నాకమే ఫోనైతే..
-శిరందాస్ శ్రీనివాస్
94416 73339
- Tags
- Poem
Next Story






