- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు

X
"కళ్ళతో నడక..."
అచ్చు తప్పేం కాదిది,
అచ్చూహల్లుల అక్షరాల దారి.
కుదురుగా సరళ రేఖలై సాగే
వాక్యాల తొవ్వల్లో పదపదాన
మెత్తని చూపుల అడుగులు.
ఆ దారిన.. అంతర్నేత్రాలు
చూసే భావదృశ్యాలు
అరూప రూపాలతో
కదిలిపోయే కళ్లజంట
కన్నులు
ఏ వన్నెజోడు ధరించడమైనా..,
నడక సాఫీగా అనుకూలంగా
సాగడానికే!
ఆ సరళపు బాటల్లోని
నిరంతరాయపు నడకలు
నెమ్మదిగానైనా
ఎగుడు దిగుళ్ళ జీవన మార్గాలతోను
జతకడతాయి.
ఆ అక్షరాల శాద్వలాలు
బతుకు బాటల గరకుదనంపై
సుతిమెత్తగా విస్తరిస్తాయి.
ఆ రమణీయ వాక్యాలు
జీవితాలను నెమ్మదిగా
హృద్యమైన కావ్యాలుగా మలుస్తాయి.
- మడిపల్లి రాజ్‌కుమార్
99496 99215
- Tags
- Poem
Next Story






