- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు

మనిషిని బతికించే భాష
తీపీచేదు కారం మమకారం కొసరి కొసరి
మాట్లాడే నోరు కార్చే సొల్లు
పన్నీరు కన్నీరు ఏరు
మాటకూ మంతికీ
రికాంలేని నడక బాట
ఆపై కొలువుదీరే అందంగా
తాటి ఆకులమీద
ఘంటంపట్టిన చేతిరాతల
వెలిగే సాహిత్యమెంతో
కథ కవిత బంధాలై
కలాల సిరా కాగితాల
తొంగిచూసే లిపి బడివొడిలో
సుద్దముక్క బ్లాక్ బోర్డుపై రాత
గురువుల జీవద్భాష
గుండెల పరుగైన రుద్రవీణ
ప్రేమలేఖల సంగమం
ప్రత్రికల వార్త కవితల ఆడే మట్టిభాష
కంప్యూటర్ భాషలో
అవుట్ ఆఫ్ ది బాక్సు ఆటలోదేలే
అన్నీ తనైన గూగుల్ జతగూడే
కాలంలో
దగ్గరి దారుల్లో షార్ట్ కట్ సోపతి
మనిషీ మనిషి మాటల్లేని
మర పనిలో గాలి అలపై తేలే
అందమైన శిలా శిల్పం
చిరుచిత్ర సంకేత భాష నడకల ఇమేజ్
అక్షరం తెరిచిన కిటికీల తగ్గే
మధురోహల గాలివాసన
ఇమోజ్ మోజు భావభాష ఇప్పటికైతే
లేటెస్ట్ రూపసంకేత భాష
నిన్నూనన్నూ
మరిచిపోని గొప్పకళ భాష
బాహ్యాంతరంగం కాన్వాస్‌పై
రాసే భావోద్వేగం
ప్రపంచంలో మనిషిని
మనిషి మనిషికీ కనెక్ట్ చేసేదే భాష
డా.టి.రాధాకృష్ణమాచార్యులు
98493 05871
- Tags
- Poem






