ముదిరి జారిన పండు కథ

by Ravi |   (  Updated:2025-01-19 22:30:49  IST  )

Poem

ముదిరి జారిన పండు కథ
X

ఒక్క దినం

ఇల్లు ఊడువకపోతే

లోకమేమీ మునిగిపోదు.

ఒక్క వారం

వాకిళ్ల సానుపు వేయకపోతే

ఊరేమీ కాలిపోదు.

చేతగానప్పుడు

ముదురుకొని మూలకు

పండాలే గాని

నింగికి వేసిన నిచ్చనని ఎక్కుతానంటే

పోయి బొందల పండుడే ఉంటది.

- బాలాజీ పోతుల

81792 83830

Next Story