- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు

X
ఉన్మాదపు అల్పపీడనంతో
ఎన్నో దేశాలను కన్నీటిమయం చేసే
మనిషి హృదయ తుఫాను ముందు
కొన్ని ప్రదేశాలను నీటిమయం చేసే
ఈ ప్రకృతి తుఫాను దిగదుడుపే!......
మనిషితనపు రాగాల్ని
వినిపించాల్సిన
నీ హృదయతంత్రులపై
అమానుషత్వపు వేళ్లు
ప్రళయగీతిని
మీటుతూనే వున్నయ్!......
జీవితాల పచ్చని చెట్లలో
చొరబడే విద్వేషపు కార్చిచ్చును
అసాంతం ఆర్పేసే
హృదయాల చల్లదనం
ఎక్కడుంది?!.....
ఎక్కడినుంచో
వొక స్మృతి కిరణం
బాకులా దిగబడింది
అందుకే ఈ గుండె
రగిలే సెగలతో
పొగలు కక్కుతోంది!.....
- డాక్టర్ కొత్వాలు అమరేంద్ర
91777 32414
- Tags
- Poem
Next Story






