జాడ చిక్కదు..

by Ravi |   (  Updated:2025-01-19 23:30:40  IST  )

Poem

జాడ చిక్కదు..
X

నాటు కోళ్లోలే

సాక్కుంటున్నాయి

కార్పొరేట్లిప్పుడు

పాలక పక్షాల్ని..

కూయమన్నప్పుడు

కూయాలి..

కోసుకున్నప్పుడు

కూరవ్వాలి..

గండుపిల్లులూ

వేటకుక్కలూ

తోడేళ్ళూ

నిత్య గెస్టులు..

మొన్న పన్సారే

నిన్న గౌరీలంకేశ్

సాయీ..ముఖేష్

జనం బిడ్డలీళ్ళు

దినాం ఎందరో

మాయమైతరు

ఏలేటోళ్ల హింసే

దేశమెల్లా శోకం

గంత లున్నా

అవిప్పేసినా

నజర్లేని కళ్ళే

న్యాయ మీడ

నెత్తుటి చుక్కా

విరిగిన బొక్కా

రాలిన రెక్కా

జాడ చిక్కదు..

- ఇక్బాల్

94407 75732

Next Story