- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు

ఇంట్ల మనుషులున్నర?
లేరాని? చెప్పేది ఆకిట్ల ముగ్గే.....
ఆనాడు ఇల్లెంత్తున్నదో
అల్ల సగం ఆకిలుండేదట...
ఆడది ఆకిట్ల పాశి ఊడ్వకుండ
ఇంట్ల పని ముట్టకపోవు....
ఇప్పుడు ఇల్లు కోట్లల్లుంటే...
ముందట కోండ్ని కమ్మెంత ఆకిలుంటంది...
బర్ల కొట్టమంత బాతు రూములుంటన్నవ్..
ముత్తేమంత ఆకిలూడ్వనీకి
రోజు పనామె రావాలే...
"ఆస్తులు వీళ్లవి ఆకిళ్ళు వాళ్ళవి..."
ఆనాడు పేదోడి తినే మక్కగడ్క,
జొన్నరొట్టె ఇయ్యాల ఉన్నోడికి బలమైంది...
ఒక్కన్నే కనాలని గీత గీసుకొని...
నాలుగిండ్లు కొనాలని పోటీ పడుడు..
శీకట్ల బతికిన ఆ రోజుల్ల
ఆకాశంలో సందమామే దీపమయ్యేది...
బాయిల ఉప్పునీళ్ళు తాగిన
మనసులు మాత్రం తీయగుండేది...
ఇల్లంటే అప్పుడు
బల్గమంత కలసుండుడు...
ఇప్పుడు ఇల్లంటే బాల్కనీలుండుడు....
బతుకు జరంత జడ్కిస్తే
ఆ బాల్కిని మీంచి
దూకి పానం తీసుకునుడు....
ఈ కాలంల చావు
కాలింగ్ బెల్ కొట్టినట్లె వస్తె
బతుకుడంటే ఆశలకి
నిచ్చెలను తయారుచేసుకునుడే...
ఎందుకంటే ఆశలు
ఎప్పుడో ఆకాశాన్ని అంటుకున్నవి...
ఇక నిచ్చెల్ని ఎక్కుడే మిగిలుంది...
తుమ్మల కల్పన రెడ్డి
96404 62142
- Tags
- Poem






