- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు

నువ్వు నెమ్మదిగా
మరణించటం ప్రారంభిస్తావు
నువ్వు ప్రయాణించకపోతే,
నువ్వు చదవకపోతే,
జీవన శబ్దాలను ఆలకించకపోతే,
నిన్ను నువ్వు ప్రశంసించుకోకపోతే,
నువ్వు నెమ్మదిగా చనిపోవటం ప్రారంభిస్తావు.
నీ ఆత్మాభిమానాన్ని చంపుకున్నప్పుడు,
ఇతరులను నీకు సహాయం చేయనివ్వనప్పుడు,
నువ్వు మెల్లిగా మృతిచెందటం ప్రారంభిస్తావు.
నీ అలవాట్లకు బానిసవైనప్పుడు,
నిత్యమూ ఒకే దారిలో వెళుతున్నట్లయితే,
నీ మూస నిత్య కృత్యాన్ని మార్చుకోకపోతే,
నిన్ను నువ్వు కొత్తగా ఆవిష్కరించుకోకపోతే,
కొత్తవారితో మాట్లాడకపోతే,
నువ్వు నెమ్మదిగా కనుమూయటం ప్రారంభిస్తావు.
నీ కళ్ళను చెమరించే, గుండె వేగాన్ని పెంచే,
భావోద్వేగాలను దాటేయాలని చూసినప్ప్పుడు
నువ్వు నెమ్మదిగా జీవచ్చవమవటం ప్రారంభిస్తావు.
నువ్వు చేస్తున్న పని నీకు
తృప్తి నివ్వనప్పుడు,
ఆనందాన్నివ్వనప్పుడు,
సురక్షితమైన దాన్ని విడిచి,
అనిశ్చిత మైన దానికి
సాహసం చేయనప్పుడు,
కలల వెనక పరుగుతీయనప్పుడు,
జీవిత కాలంలో ఒక్కసారైనా నువ్వు
అలా యత్నించనప్పుడు,
వివేచనాత్మక సలహాల నుంచి,
పారిపోతున్నప్పుడు,
నువ్వు నెమ్మదిగా మరణించటం ప్రారంభిస్తావు.
మూలం: పాబ్లో నెరూడా
అనుసృజన: డాక్టర్ చెంగల్వ రామలక్ష్మి
63027 38678
- Tags
- Poem






